తేజోమహాలయం
తేజోమహాలయం
యమునా నదీ తీరాన, రంగు రంగుపూలతో నిండిన పచ్చటి పచ్చికబయళ్ళమధ్య ఠీవిగా నిలుచున్న ప్రపంచవింత తాజ్ మహల్ గా పిలవబడ్డ తేజోమహాలయం.
నాటి రాజపుత్రుల రాజసానికి చిహ్నంగా, మేటి భారతీయ శిల్పకారుల స్వప్న సాక్షాత్కారం తేజో మహాలయ. ఆదిదేవుడైన ఆ రుద్రుని తేజస్సుకు ప్రతిరూపం ఈ చలువరాతి మందిరం. నేడు ప్రేమికులకు ప్రేమ చిహ్నంగా నిలిచి, జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకొనే భవ్య మందిరం తేహోమహాలయం.
మధ్యలో శివుడు, ఆయన చుట్టూ దేవీ దేవతల మందిరాలు, వాటిచుట్టూ ఆవాసయోగ్యమైన గదులు, రహస్య మర్గాలు, యమునలోకి వెళ్ళే సోపాన మార్గాలు, మందిరపు పై కప్పులో ఉన్న సూర్యతేజస్సును తెలిపే సూర్యకిరణాల అల్లిబిల్లి అల్లికలు, లేసులను తలపించే మందిర గవాక్షాలు, ఆర్చీలుగా అమర్చబడ్డ జంటస్వరాల తోరణాలు, గోడలనిండా అందంగా చెక్కబడ్డ శంఖుపుష్పాలు, ఉమ్మెత్త పువ్వుల మధ్యలో అందంగా అమరిన ఓంకారం, తామరల మధ్య విలసిల్లిన త్రిశూలం, మందిరపు గుమ్మటంపై ఆకాశంలోకి చూస్తున్న అష్టధాతువులతో నిర్మించబడ్డ శశిరేఖ దాని మధ్యలో పూర్ణకలశం, దానిపై కొబ్బరికాయ.
రాజపుత్ర రాజు రాజా మాన్ సింగ్ ఎన్నో కట్టడాలకు తలమానికంగా నిలిచిన మందిరం తాజ్ మహల్.
వారసత్వంగా తరువాతి కాలంలో (సా.శ.1628-1658) ఈమందిరం ఆక్రమణకు గురై తరువాత మసీదు చేయబడింది.
మొగలుల పరిపాలనా కాలంలో ఎన్నో దేవాలయాలు కూల్చబడి, లేదా మార్చబడి మసీదులయ్యాయి. అలా ఒక అద్భుత రాజమందిరం, ఒక మహాదేవాలయం కూడా కుసంస్కారులైన చరిత్రకారుల చేతుల్లోబడి, హైందవదేవాలయం కాస్తా, తాజ్ మహల్ గా, మసీదుగా మారిపోయింది.
ప్రపంచ చరిత్రలో, Encyclopedia Britanica Americanaలో కూడా తాజ్ మహల్ షాజహాన్ చే కట్టబడిందని వ్రాయబడింది.
చరిత్రలో మొట్టమొదటి సారిగా జె.బి.టావెర్నియర్ అనే ఫ్రెంచి వ్యాపారవేత్త తన పుస్తకం "Travels in India" లో ఈ విధంగా వ్రాశాడు.
షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం 20,000 మంది కూలీలతో 22 సంవత్సరాలు కష్టపడి కట్టించిన అద్భుత సౌధం తాజ్ మహల్" అని వ్రాశారు.
టావెర్నియర్ భారతదేశాన్ని సా.శ.1638-1668 సంవత్సరాల మధ్యకాలంలో ఆరుసార్లు సందర్శించారు. ఇందులో అతను రెండుసార్లే (సా.శ.1640-41, 1665) ఆగ్రాని సందర్శించారు.
చారిత్రకంగా ముంటాజ్ సా.శ.1631లో చనిపోయినట్లుగా ఉంది. అంటే టావెర్నియర్ ముంతాజ్ చనిపోయిన పది సంవత్సరాలకి ఆగ్రాకి వస్తే అప్పటికి తాజ్ నిర్మాణం పూర్తికాకూడదు.
కాని అది పూర్తి కట్టడమని రాశారు. అంటే షాజహాన్ కంటే ముందే అక్కడా భవ్యమందిరం ఉందన్నమాట.
షాజహాన్ ఆస్థానంలోని లేఖకుడు ముల్లాఅబ్దుల్ హమీద్ లహరీ వ్రాసిన "బాద్ షా నామా" గ్రంథంలో అసలు తాజ్ ప్రసక్తి లేదు. మరి షాజహాన్ అంత ప్రతిష్ఠాత్మకంగా తాజ్ ని నిర్మించి ఉంటే దానికైన ఖర్చు గురించి, కూలీల గురించి తప్పని సరిగా రాసి ఉండాలి కదా! కానీ అందులోని 402, 403 పుటల్లో వివరణ ఇలా ఉంది - "చనిపోయిన ముంతాజ్ మహల్ శరీరాన్ని ఆగ్రాకు తీసుకువచ్చి, రాజా మాన్ సింగ్ యొక్క భవనంలో ఉంచబడింది."
Friday 15th Jamadiulawal the sacred dead body of the traveller to the Kingdom of holiness Hazrat Mumtazul Aamani, who was temporarily buried was brought to the Capital Akhara bad(Agra) and an order was issued that veryday Coins be distributed among the beggers and Fakirs. The site covered with a majestic garden, to the south of Agram, and admidst which the building known as the Palace of Raja Mansingh, at Present owned by Raja JaiSingh was selected for the burial of the Queen, whose abode is in heaven. (Bad-Shah-nama).
అంటే రాజా జైసింగ్ నుంచి షాజహాన్ తాజ్ మహల్ గా పిలువబడే భవ్యమైన మందిరాన్ని తీసుకున్నాడు లేదా ఆక్రమించుకున్నాడు.
షాజహాన్ ఈ మందిరాన్నే ఎందుకు ఎంచుకున్నాడంటే తేజోమహాలయలోని శివుని గర్భగుడి ప్రాంతం బంగారంతోను, గోడల్లో వెలుతుతు కోసం వజ్రాలు, పచ్చలు, రంగురాళ్ళు పొదగబడి ఉన్నాయి. కనుక ఆ మందిరాన్ని తన భార్య సమాధికోసం ఎంచుకున్నాడు.
షాజహాన్ తన భార్య ముంతాజ్ ను మరువలేక, తన ప్రేమకు చిహ్నంగా దీన్ని నిర్మించాడని చరిత్రలో రాశారు. కానీ ముంతాజ్ అని పిలువబడే అర్జుమంద్ భానును, షాజహాన్ సా.శ.1612లో వివాహం చేసుకున్నాడు. ముంతాజ్ సా.శ.1630 లేదా 1631లో చనిపోయింది.
వారి 18సంవత్సరాల కాపురంలో ఆమె 14మంది బిడ్డలకు జన్మనిచ్చింది. 14వ బిడ్డకు జన్మనిస్తూనే కన్నుమూసింది. షాజహాన్ జమానాలో వందలమంది స్త్రీలలో ముంతాజ్ ఒకరు. అంతేకానీ, ఆమెమీద షాజహాన్ కు అంత ప్రేమలేదనుకోవచ్చు. ముంతాజ్ చనిపోయినప్పుడు ఆమె ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఖుర్హాన్ పూర్ లోని మందిరంలో ఉంది.
ఆమెను ఆ భవన సముదాయంలోని ఒక చిన్న భవనంలో ఖననం చేశారు. ఆ తరువాత సంవత్సరం ఆమె శరీరాన్ని ఆగ్రాకు తరలించి, నేడు తాజ్ మహల్ అని పిలువబడే ప్రాంతంలో ఉంచారు. మరి షాజహాన్ 22సంవత్సరాలు కష్టపడి తాజ్ ని కట్టాడన్నది అబద్ధమే కదా!
సా.శ.1652లో ఔరంగజేబు తన తండ్రికి ఒక లేఖను రాశాడు. ఇందులో మాన్ సింగ్ భవనంలోని రెండవ అంతస్తులోని గదులలో నీరు కారుతోందని, అలాగే పైన ఉన్న గుమ్మటం పగుళ్ళిస్తోందని వాటికి మరమ్మత్తులు చేయించాలని వ్రాశాడు. (ఈ ఉత్తరం "ఆదాబ్-ఈ-అలంగీ", యాద్ గార్ నామా" గ్రంథాలలో లభ్యం).
ముంతాజ్ సా.శ.1631లో చనిపోయి, షాజహాన్ 22సంవత్సరాలు తాజ్ మహల్ కట్టుంటే సా.శ.1653లో అది పూర్తి కావించబడాలి. సా.శ.1652లోనే దానికి మరమ్మత్తులు చేశారంటే అది అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిర్మించబడి ఉండాలి.
భారత పురావస్తు శాఖవారు 1982లో ఒక చిన్న పుస్తకం "Taj Museum" - అని విడుదల చేశారు. అందులో - "Mumtaz died in Burhanpur and was buried there. Six months later Shahjahan exhumed her body and sent her Coffin to Agra, an tha site Until then stood Late Raja Mansingh's Palace ......."
అంటే తాజ్ మహల్ ని షాజహాన్ కట్టలేదన్నది వాస్తవం. అయినా సరే భారతప్రభుత్వం, NCERT, SCERT చరిత్ర పుస్తకాలన్నింటిలో షాజహాన్ తాజ్ మహల్ కట్టించెను అని రాసినదాని చెరిపేసి, అది మాన్ సింగ్ భవనమని, దానిపేరు "తేజోమహాలయ" అని రాయరు ఎందువల్ల?
సా.శ.1905 సంవత్సరం వరకు ఆగ్రా గజెట్ లో రాజా మాన్ సింగ్ భవనంగా ఉన్న తాజ్ మహల్, 1905లో లార్డ్ కర్జన్ హయాంలో షాజహాన్ నిర్మించినట్లుగా మసిపూసి మారేడుకాయ చేశాడు.
కారణం హిందూ, ముస్లింలను చీల్చటానికే. నాటినుంచి నేటివరకు ఆ తప్పు సరిదిద్దబడలేదు.
ఇప్పటికీ తాజ్ మహల్ లోని క్రింది అంతస్తులోని 22 గదులు సీలు వేయబడి సందర్శకులకు అనుమతి లేకుండా ఉన్నాయి. షాజహాన్, ముంతాజ్ సమాధుల చుట్టూ ఉన్న షట్చక్రాకార తెరలు తరువాత చుట్టూ ఉన్న గదులన్నీ ఇటుకలతో మూసివేయబడ్డాయి. అలాగే రహస్యమార్గాలు, యమునలోకి ఉన్న సోపానమార్గాలు, అదే ఆవరణలో ఏడంతస్తుల లోతులో ఉన్న బావి, దానిచుట్టూ చల్లగా ఉండే గదులు, తాజ్ చుట్టూ ఉన్న నౌకలకు లంగరు వేసే రింగులు, ఉద్యానవనంలో ఉన్న శిఖరం యొక్క నీడ ఇవన్నీ కూడా తాజ్మహల్ సమాధికోసం కట్టినది కాదని, అదొక ఆలయమని చెప్తాయి.
తాజ్ కి రెండువైపులా ఉన్న వంటశాల, వాయిద్యాలను దాచే మందిరం అది ఆలయమేనని ఋజువు చేస్తున్నాయి. ఇప్పటికీ సమాధిని దర్శించే సందర్శకులు చెప్పులు విడిచి లోపలికి వెళ్ళడం ఆనవాయితీ.
ఒకవేళ నిజంగా అది ముంతాజ్ కోసం నిర్మించిన సమాధి అయితే ఇవన్నీ అనవసరం కదా!
ఇటుకలను అడ్డుపెట్టి మూసేసిన గదులను మళ్ళీ తెరిస్తే, తాజ్ కి సంబంధించిన చాలా వాస్తవాలు తెలుసుకుంటే, బహుశా భారతదేశ చరిత్ర మరోవిధంగా వ్రాసుకోవచ్చునేమో!
ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి నిజాల్ని తెలుసుకొని, అసలైన భారతదేశ చరిత్రను ముందుతరాలకు అందించాలని, ’కాలగర్భం’లో కలిసిన తేజోమహాలయం మళ్ళీ పునరుద్ధరించబడాలని కోరుకుందాం.
ఇచట నుండి సేకరణ
Comments
Post a Comment