ఒకరాజు... ఏడుగురు కొడుకులు కథ...
అవథాని శ్రీ గరికపాటి నరసింహారావుగారు 2005 లో అమెరికాలోని ఆంథ్రులకు శ్రీమద్రామాయణంలోని థర్మసూక్ష్మాలను వివరిస్తూ ఇచ్చిన ప్రసంగంలో " అనగనగా ఒక రాజు . ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ." అన్న కథలోని తత్వచింతనా కోణాన్ని అవిష్కరించారు . అది ఇక్కడ అందచేస్తున్నాను . ఈ కథ ప్రతి తల్లి , తండ్రి చిన్నపిల్లలకు చెప్పే కథల్లో ముఖ్యమైనది . అందరికి తెలిసినదే . మామూలు కథగా ఆలోచిస్తే ఎదో పిచ్చి కథ అనిపిస్తుంది . ఇది కచ్చితంగా మన జీవితానికి ఎదో సందేశాన్ని ఇస్తుంది . అసలు రాజుగారి కొడుకులు వేటకు వెళ్ళి చేపలు తేవటమేమిటి .. అందులో ఒక చేపే ఎండక పోవటమేమిటి ? కారణము గడ...