17 సెంట్ల భూమిలో 15 క్వింటాళ్ల ధాన్యం

బీజింగ్‌: వరి ఉత్పత్తిలో మరో రికార్డు సృష్టించినట్లు ఫాదర్ఆఫ్హైబ్రీడ్రైస్యువాన్లంగ్పింగ్ప్రకటించారు. చైనాకు చెందిన శాస్త్రవేత్త గతంలోనూ రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి చేశారు. తాజాగా 837 చదరపు గజాల(0.07హెక్టార్లు)లో 1537 కిలోల వడ్లు పండించి గతంలో తాను సృష్టించిన రికార్డును బద్దలు కొట్టానని వివరించారు. అంటే 17 సెంట్ల భూమిలో 15 క్వింటాళ్ల ధాన్యాన్ని పండించారన్న మాట.   సాంకేతికతను ఐదోతరం హైబ్రీడ్రైస్టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు. ఇటీవల జపాన్ఉత్పత్తి చేసిన కోషిహికారి రైస్తరహాలోనే ప్రస్తుతం ఉత్పత్తి చేసిన వడ్లు కూడా అత్యుత్తమ నాణ్యత కలిగి ఉన్నాయని తెలిపారు. కాగా, గత యాభై ఏళ్లుగా వరి ఉత్పత్తిలో పరిశోధనలు చేస్తున్న యువాన్గతంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. చైనా మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభించిన హైబ్రీడ్రైస్బ్రీడింగ్పోగ్రామ్లో భాగంగా 2000 సంవత్సరంలో హెక్టారుకు 1.05 టన్నుల వరిని ఉత్పత్తి చేశారు. 2014లో నాలుగో దశలో లక్ష్యాన్ని 15.4 టన్నులుగా నిర్దారించగా.. యువాన్తన బృందంతో దీనినీ అధిగమించాడు.



Comments

Popular posts from this blog

Only for YOU

High demand for Foreign Language experts in India - Recruise Study